Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2025-03-14 10:26:52
తెలుగు వెబ్ మీడియా న్యూస్:-ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో సచిన్ తెందుల్కర్ నేతృత్వంలోని ఇండియా మాస్టర్స్ ఫైనల్క దూసుకెళ్లింది. గురువారం సెమీఫైనల్లో ఇండియా.. 94 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది.
రాయుర్: మొదట యువరాజ్ సింగ్ (59; 30 బంతుల్లో 1x4, 7x6), సచిన్ (42; 30 బంతుల్లో 7×4), స్టువర్ట్ బిన్నీ (36; 21 బంతుల్లో 5x4, 1x6) మెరుపులతో ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆసీస్ బౌలర్లలో డోహర్టీ (2/30), డానియల్ క్రిస్టియన్ (2/40) సత్తా చాటారు. అనంతరం షాబాజ్ నదీమ్ (4/15), వినయ్ కుమార్ (2/10), ఇర్ఫాన్ పఠాన్ (2/31) విజృంభించడంతో ఆసీస్ 18.1 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. బెన్ కటింగ్ (39) టాప్ స్కోరర్. శుక్రవారం వెస్టిండీస్, శ్రీలంక మధ్య రెండో సెమీస్ విజేతతో.. ఆదివారం సచిన్ సేన ఫైనల్ ఆడుతుంది.