Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-05-28 13:40:09
తెలుగు వెబ్ మీడియా న్యూస్:పలు కారణాలతో విదేశీ విద్యార్థుల వీసా లను రద్దు చేస్తూ వారిని దేశం నుంచి బహిష్కరిస్తున్న అమెరికా తాజాగా మరో హెచ్చరిక చేసింది. తమ విద్యా సంస్థల్లో చదివే భారత్ సహా విదేశీ విద్యార్థుల గైర్హాజరు ఆధారంగా కూడా వీసాలను రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు భారత్లోని అమెరికా ఎంబసీ దీనిపై ఓ ప్రకటన జారీ చేసింది. విద్యాసంస్థ నుంచి డ్రాపౌట్ అయినా, క్లాస్లు ఎగ్గొట్టినా, విద్యాసంస్థకు చెప్పకుండా స్టడీ ప్రోగ్రామ్ నుంచి వెళ్లిపోయినా మీ స్టూడెంట్ వీసా రద్దవుతుంది. భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసాలకైనా మీరు అర్హత కోల్పోతారు. సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఈ నిబంధనలను అనుగుణంగా నడుచుకోండి. మీ విద్యార్థి వీసాను కొనసాగించుకోండి అని యూఎస్ ఎంబసీ ఆ ప్రకటనలో వెల్లడిరచింది.